అనగనగా ఒక వూరిలో లొట్టయ్యఅనే అమాయకుడుండేవాడు .అతనిని ఒకసారి కోపముతో పెళ్ళాము ఒరే లొట్టయ్యా! అన్నం తిందువుగాని రారా అని పిలిచింది. నన్నే లొట్టయ్యా అంటావా అని కోపముతో రోకలిబండతో కొట్టగా ఆమె చనిపోయినది తరువాత పూడ్చిపెట్టి అక్కద గొంగూర మొక్కని నాటాడు. అది పెద్దదయిన తరువాత ఆకు కోసి కూరవండటం మొదలుపెట్టాడు. అది కుతకుతలొట్టాయ్ అనివుడుకుతుంది . దాంటో కోపమువచ్చి దాన్నితీసుకెళ్ళి తొట్టిలో వేశాడు. దాన్ని తిన్న గేదెలు బే...బే.. లొట్టాయ్ బే..బే లొట్టాయ్ అని అరవటము మొదలెట్టాయి. నన్ను లొట్టాయ్ అంటావా అని కర్రతో బాదగా అదిచ చ్చింది . దాని తోలువలచి చెప్పులు కుట్టించుకుంటే ,అవి కిర్రుకిర్రు లొట్టాయ్.కిర్రుకిర్రు లొట్టాయ్. అణటం మొదలుపేట్టాయి. కోపముతో వాడు వాటిని విసిరేశాడు.వాటినితిన్న కుక్కలు భౌ.భౌ లొట్టాయ్ అని అరవటము మొదలు పెట్టాయి. వాడుకోపముతో కుక్కను ఎత్తి బావిలో పడవేశాడు. అది మునిగేటప్పుడు నీళ్ళు బుడుగు బుడుగు లొట్టాయ్ బుడుగు బుడుగులొట్టాయ్ అని శబ్దము వచ్చినది. వాడు కోపము పట్టలేక ఎగిరి బావిలోదూకాడు. అంతే.....
ఆవుల హైమ 8వతరగతి

లోడ్ అవుతోంది...