వుసిరికాయంత వూరిలో ములక్కాడంత ముసలమ్మ వుండేది. ఆమెకు కాబేజీ అంత కూతురు వుంది. ఒకరోజు ఆమెకు వంకాయంత వజ్రం దొరికింది. దానిని బీరకాయంత బీరువాలో దాచింది. దానికి తాటికాయంత తాళం వేసింది, ఒకరోజు దానిని దాయటం దోసకాయంత దొంగోడు చూశాడు.కాకరకాయంత కన్నంవేసి తాలం పగలగొట్టి దానిని తీసుకెళ్ళటం చూసిన ముసలమ్మ పొట్లకాయంత పోలీసుకు చెప్పింది. వాడు జీడిపప్పంత జీబులోవెళ్ళి లవంగమంత లాఠీ తీసుకుని ,బొబ్బాస కాయంత బూట్లేసుకుని దోసకాయంత దొంగను పట్టుకుని జామకాయంత జైలు లో వేసాడు.

లోడ్ అవుతోంది...