Webdunia: Portal - Search - Mail - Greetings   More >>
Support | Font Download | Feedback
Search  
Welcome, Guest  [ Register | Sign In ]

ఇంగ్లీషు బాష.. ఎంతో తమాషా...

రానిభాష


ఒక పల్లెలో ఒక మొద్దబ్బాయి ఉండేవాడు వాడిని ఇంగ్లీషు చదివించాలని వాళ్ళ చుట్టాలువాన్ని సిటీకి తీసుక వచ్చి స్కూల్లో చేర్చారు. అతడు స్కూలుకు వెళితే టీచర్ అయిదు కొత్తపదాలు వ్రాసుకుని రమ్మన్నది. సాయంత్రం ఇంటికి వేళ్ళేటప్పుడు,బస్సు కండక్టరు రైట్.. రైట్.. అనటమువిని ,ఇది ఒక కొత్త పదములా వుందని, వ్రాసుకుని నేర్చుకున్నాడు. దిగేటప్పుడు హోల్డాన్..హోల్డాన్ అనటం విని దాన్నీ వ్రాసుకుని చదివాడు. వాళ్ళమ్మ ఒక కేజీ బియ్యం తెమ్మనగా దానిని వ్రాసుకున్నాడు. ట్.వ్. దగ్గర కూర్చుని సచిన్ సిక్స్ కొట్టడం చూసి వండరఫుల్ షాట్ పక్కవారు అనగా దాన్ని కొత్తపదములా వ్రాసుకున్నాడు. రిమోట్ క్రిందపడిటే కుక్క పిల్ల అందించే యాడ్ చూసి థాంక్యు అనటాన్ని వ్రాసుకున్నాడు.

మరుసటిరోజు స్కూలుకు వెల్లగా టీచర్ నిన్న నేను చెప్పినవి చేసావుగదా అవి చెప్పు అనగా రైట్..రైట్.. అన్నాడు. టీచర్కు కోపం వచ్చి ఒక దెబ్బవేసింది. వాడు వెంటనే హోల్డాన్ హోల్డాన్ అన్నాడు. నీదగ్గర కొవ్వెంత వుందిరా అని టీచర్ తిట్టగా కె.జి. అన్నాడు. మఱొకదెబ్బ వీపుపై పడగానే వండరఫుల్ షాట్.. అన్నాడు. వెళ్ళి కూర్చో వెధవా అనగానే థాంక్యు..అన్నాడు.

నిరాకరణ